TG Government: కుల గణనకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

0
19

రాష్ట్రంలో కుల గణన నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందుకోసం రూ.150 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రతి ఇంటి కుల, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ వివరాలను సేకరిస్తామని పేర్కొంది. . అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు కుల గణన కోసం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రూ.150 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అందులో ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగనన చేపట్టి బిసిల జనాభా లెక్కలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26ను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిసి కులగణన నిర్వహించి బిసిల లెక్కలు తేల్చాలని రెండు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా ఫలించిందన్నారు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ .

జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే సర్వే చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా చెప్పారు. ప్రజలను పాలకులను చేయడమే తమ ఉద్దేశ్యమని తెలిపారు.