ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. 15 వేల బాండ్, రూ.లక్ష పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది.
విచారణకు హాజరుకావాలని ఇప్పటికే పలుసార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటసులు జారీ చేసింది. కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ మెజిస్టిరియల్ కోర్టుకు వెళ్లింది. దీంతో మార్చి 16న తమ ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఈ రోజు అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం 15 వేల బాండ్ రూ.లక్ష పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది కోర్టు.
ఇవాళ కోర్టు ముందుకు కవిత
ఇదే కేసులో నిన్న అరెస్టయిన కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు ముగిశాయి. మరికాసేపట్లో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. కవితను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు ఈడీ అధికారులు.