TG Politics: రౌస్ అవెన్యూ కోర్టులో కవిత… కస్టడీ కోరుతూ పిటిషన్

0
11

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడీ కోరుతూ పిటిషన్ వేయనున్నారు. ఇప్పటికే రిమాండ్ డైరీని సిద్ధం చేశారు. కాగా, మద్యం కేసులో ఆమెను నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, ఢిల్లీకి తరలించారు. రాత్రి ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో ఉంచి, వైద్య పరీక్షలు చేయించారు.

ఢిల్లీలో ఉన్న 7జిల్లా కోర్టుల్లో ఈ రౌస్ అవెన్యూ కోర్టు ఒకటి. రౌస్ అవెన్యూ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో దీన్ని 2019లో స్థాపించారు. చిదంబరం(కాంగ్రెస్), DK శివకుమార్(INC), బ్రిజ్ భూషన్(BJP), సిసోడియా(AAP), లాలూ(RJD) వంటి నేతల కేసులను ఈ కోర్టు విచారించింది.

మరోవైపు కవిత అరెస్టును నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టనుంది. బీజేపీ రాజకీయ దురుద్దేశంతోనే తమ ఎమ్మెల్సీని అరెస్టు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాల్లో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళా సంఘాలు, మహిళలు భాగమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.