ALL THE BEST.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు..

0
29

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,23,092 మంది విద్యార్థులు, తెలంగాణలో 5.08 లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి.

తెలంగాణలో విద్యార్థులకు 5 నిమిషాల(ఉ.9.35 వరకు) గ్రేస్ పీరియడ్ ఇవ్వగా.. ఏపీలో లేదు. ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 5,08,385 మంది స్టూడెంట్లు హాజరుకానున్నారు. 2,676 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీలో ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో ఎగ్జామ్స్ ఏప్రిల్ 2తో ముగియనుండగా.. ఏపీలో ఈ నెల 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధిస్తారు. పరీక్ష కొనసాగేంత వరకు చుట్టుపక్కల జిరాక్స్‌, కంప్యూటర్‌ సెంటర్లను మూసేయిస్తారు.