IPL: గుజరాత్ టైటాన్స్‌లోకి సర్ఫరాజ్ ఖాన్?

0
26

టీమ్ ఇండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆయన ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు టాక్.

కాగా ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. 2023 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సర్ఫరాజ్‌ను 2024 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. అయితే, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా చేరనున్నాడు.

ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌కు టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ ఆటతీరు అద్భుతంగా ఉంది. సర్ఫరాజ్ తన అరంగేట్రం టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించాడు.