Modi in Sangareddy : ఇవాళ సంగారెడ్డిలో మోడీ టూర్..షెడ్యూల్ ఇదే..

0
13

ప్రధాని మోడీ ఇవాళ సంగారెడ్డిలో పర్యటించనున్నారు. నిన్న ఆదిలాబాద్ లో పర్యటించిన మోడీ..రాత్రి రాజ్ భవన్ లో బస చేశారు. ఇవాళఉదయం సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ లో దర్శనం చేసుకొని అనంతరం సంగారెడ్డి పర్యటనకు వెళ్లనున్నారు..

9 వేల కోట్లతో అభివృద్ధి పనులు

జిల్లాలో రూ.9వేల21 కోట్ల అబివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా నాందేడ్ అకోలా 161వ నేషనల్ హైవేను ప్రారంభిస్తారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన తర్వాత11 గంటలకు పటాన్ చెరు మండలం పటేల్ గూడ ఎల్లంకి కాలేజీ దగ్గర ఎస్ఆర్ ఇన్ ఫినిటీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే 14 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీజేపీ శ్రేణులు, ప్రజలు మోదీ పర్యటనకు హాజరయ్యేందుకు ఆ పార్టీ జిల్లా కమిటీ ప్లాన్ చేసింది. పార్టీ నాయకులు కూర్చునేందుకు ఒక ప్రాంగణం, అధికారులు కూర్చునేందుకు మరో ప్రాంగణాన్ని సభాస్థలి వద్ద ఏర్పాటు చేశారు.

ప్రధాని టూర్ తో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ప్రధాని పాల్గొనే ప్రాంతాలను కేంద్ర భద్రత బలగాల బృందం భద్రత చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎక్కడా కూడా రిమోట్ డ్రోన్లను ఆకాశంలో ఎగరకుండా నిషేదం విధించింది. రెండు హెలిపాడ్ లను సిద్ధం చేసి ఉంచారు.

సోమవారం ఆదిలాబాద్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మిబేగంపేట ఎయిర్ పోర్ట్ లో మోడీకి స్వాగతం పలికారు. అనంతరం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే బస చేశారు.