Sunrisers Hyderabad : సన్ రైజర్స్ కొత్త బౌలింగ్ కోచ్ ఇతడే

0
13

ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ మార్పులు చేపట్టింది. ఇవాళ ఉదయం కొత్త కెప్టెన్ గా కమిన్స్ ను ప్రకటించిన యాజమాన్యం.. తాజాగా కొత్త బౌలింగ్ కోచ్ ను నియమించింది. న్యూజిలాండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ కోచ్ గా వ్యవహరిస్తారని ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల డేల్ స్టెయిన్ అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది.

జేమ్స్ ఫ్రాంక్లిన్ 2011, 2012 సీజ‌న్లలో ముంబై ఇండియ‌న్స్‌కు ఆడాడు. ఫ్రాంక్లిన్ 108.43 స్ట్రయిక్ రేటుతో 327 ప‌రుగులు సాధించాడు. 9.02 ఎకాన‌మీతో 9 వికెట్లు తీశాడు. ఫ్రాంక్లిన్ 2001 నుంచి 2013 వరకు న్యూజిలాండ్ తరఫున 31 టెస్టులు, 110 వన్డేలు, 38 టీ20 మ్యాచులు ఆడాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. మార్చి 7 వరకు జరగాల్సిన తొలి 21 మ్యాచులుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప…