TG Politics: బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌?

0
26

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని బీఆర్ఎస్ కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మిస్తానని, కమిటీలు వేస్తామని శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిరంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలు పార్టీలోకి వస్తే.. స్వార్థపు నాయకుల అవసరం ఉండదని చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు.. గాడిద వెంట పోతేనే గుర్రాల విలువ తెలుస్తది. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మారు. త్వరలోనే వారు నిజాన్ని గ్రహిస్తారు. దళిత బంధు స్కీమ్ ఎదురుదెబ్బ తీయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ పథకంతో లబ్ధి పొందిన కుటుంబాల జీవనం మెరుగైందని చెప్పారు.

సోమవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గురుకుల విద్యను అభివృద్ధి చేసేందుకు ప్రవీణ్ కు ఎంతో సహకరించానన్నారు. దళిత బహుజన బిడ్డలను విద్యావంతులను చేసి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఎదిగేందుకు బాట చూపించామని చెప్పారు. దళితులకు ఏ పార్టీలో లేని స్పేస్ బీఆర్ఎస్ లో ఉంటుందన్నారు.