AP Politics: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు

0
38

బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. వైసీపీపై ఆయన సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో ఆ పార్టీ టికెట్ కేటాయించింది.

గత ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా అమరావతి ప్రాంతానికి చెందిన నందిగం సురేష్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిగా నిలబడిన ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాల్యాద్రిపై పదహారు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఈ సారి బాపట్ల నుంచి వైసీపీ తరపున ఆయనకు టిక్కెట్ ఖరారు చేశారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును విజయనగరం జిల్లా చీపురుపల్లికి ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట చంద్రబాబును గంటా కలిసి మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గంటా హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఆలపాటి రాజాకు పెనమలూరు సీటు కేటాయించినట్లు సమాచారం. దీనిపై టీడీపీ అధికారిక ప్రకటన చేయనుంది.