Sukhesh Vs Kavitha: సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది.. కవితకు సుఖేష్ చంద్ర లేఖ

0
48

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం త్వరలోనే అరెస్టవుతారు.తీహార్ జైలు క్లబ్లో త్వరలో సభ్యులు కాబోతున్నారు మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, సీఎం కేజీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. సినిమా క్లైమాక్స్కు చేరుకుందని లేఖలో పేర్కొన్నారు.

లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది. బూటకపు, రాజకీయ కేసులని ఆమె చేసిన వాదన అబద్ధమని తేలింది. నెయ్యి డబ్బాలంటూ ఆమె చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుంది. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో BRS రూ.వేల కోట్లు దాచిందని తీహార్ జైలు నుంచి లేఖ రాశాడు.

లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టుపై ఈడీ నిన్ననే అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉంది. ఆప్ నేతలకు వంద కోట్లు చేర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు 245 చోట్ల సోదాలు చేశాం. రూ.128 కోట్ల ఆస్తులను జప్తు చేశాం. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్. విజయ్ నాయర్లతో కవితకు సంబంధం ఉందని తెలిపింది.