Srinivas Goud : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్

0
23

బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తనకు ప్రాణ హాని ఉందంటూ, 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు దానిని కొట్టివేసింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదంటూ హైకోర్టు బదులిచ్చింది.

శ్రీనివాస్ గౌడ్ కు గన్ మెన్ లు అవసరమో లేదో తెలపాలంటూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను హైకోర్టు ఆదేశించింది. దీనిపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు. మార్చి 19 కి వాయిదా వేసింది.

కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి 1,87,38 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. .