తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ రాత్రి 9.10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు రాధా కృష్ణన్. రేపు ఉదయం 11.15 గంటలకు రాధాకృష్ణన్ రాజ్ భవన్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే.. రాధాకృష్ణన్ తో ప్రమాణం చేయించనున్నారు.
తమిళిసై రాజీనామాతో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను తెలంగాణ ఇన్ ఛార్జ్ గవర్నర్ గా నియమించింది కేంద్రం. పూర్తిస్థాయి గవర్నర్ నియామకం అయ్యే వరకు సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌లుగా కొనసాగనున్నారు.
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ కోయంబత్తూరు నుండి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. మరో వైపు గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళి సై తమిళనాడు లోని కన్యాకుమారి, చెన్నై సౌత్, తిరునల్వేలి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేసే అవకాశం ఉంది.