Cool News: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

0
14

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్​లోనూ తేలికపాటి జల్లులు పడే చాన్స్ ఉందంది. రోజంతా మబ్బులు, ఉదయం పొగమంచు ప్రభావం ఉండొచ్చని పేర్కొంది.

మరోవైపు మంగళవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, జనగామ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. మరికొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా బజార్​హత్నూర్​లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.