AP Politics: నువ్వు వైసీపీలోకి రా..పవన్ కు వంగ గీత కౌంటర్

0
30

తనను జనసేనలోకి ఆహ్వానించిన పవన్‌కళ్యాణ్‌కు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. తాను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 2009 కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని… 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకే ఉందన్నారు.

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గెలిచి తీరుతానని గీత ధీమా వ్యక్తం చేశారు. పవన్ కాపు అయితే.. తాను కూడా కాపు ఆడపడుచునేన్నారు. ‘కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదు. ప్రతి వర్గాన్నీ అభివృద్ధి చేయాలనేదే లెక్కగా ఉండాలి. కాపులంతా వంద శాతం నాకు సహకారం అందిస్తారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది’ అని అన్నారు.

నిన్న జనసేన కార్యకర్తల భేటీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వంగ గీత జనసేనలో చేరాలని అన్నారు. వంగ గీత పీఆర్పీ నుంచి గెలిచారని గుర్తు చేశారు. ఈ సారి పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.