Viral: వైజాగ్ బీచ్ లో క్లింకార దర్శనం.. ఫోటోలు వైరల్

0
31

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. వైజాగ్ లో ఓ వైపు గేమ్ చేంజర్ షూటింగ్..మరో వైపు ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు చరణ్. భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి విశాఖ బీచ్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. క్లీంకారను బీచ్‌లో ఆడిస్తూ సరదాగా గడిపారు. ఉపాసన తన ఇన్ స్టాలో ఈ వీడియో పోస్ట్ వేశారు. రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో కలిసి వైజాగ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉపాసన రాళ్లపై కూర్చుని ఉండగా.. రామ్ చరణ్ క్లింకారాను ఎత్తుకుని కనిపించాడు.ఈ ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.