AP Politics: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా ఉదయ్.. ప్రస్థానం ఇదే

0
98

కాకినాడ జనసేన అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఉదయ్ తన కోసం పిఠాపురం అసెంబ్లీ సీటు త్యాగం చేశారని చెప్పారు పవన్. అందుకే కాకినాడ్ నుంచి ఉదయ్ ను పోటీలో దించుతున్నట్లు తెలిపారు. మోదీ, అమిత్ షా తనను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని కోరితే..అపుడు ఉదయ్,తాను స్థానాలు మార్చుకంటామని చెప్పారు పవన్.. ఉదయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పవన్.

అయితే ఈ ఉదయ్ ఎవరనేది అందరూ చర్చించుకుంటున్నారు. 2006లో హైదరాబాద్ లోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. చివరిసారిగా దుబాయ్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. దుబాయ్ లో ఉద్యోగాన్ని వదిలేసి భారత్ వచ్చి టీ టైమ్ పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చెయిన్ ప్రారంభించాడు. కోట్ల రూపాయల టర్నోవర్ తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు.

టీ టైమ్ ఐడియా వర్కౌట్ కావడంతో ఉదయ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 2016లో రూ.5 లక్షల పెట్టుబడితో రాజమండ్రిలో తొలి టీ దుకాణం స్థాపించగా.. ఇప్పుడు టీ టైమ్ ఫ్రాంచైజీల సంఖ్య 3 వేలకు పెరిగింది. టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ రూ.35 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు