శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో రద్దీ తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉన్నాయి. దర్శనం సులువుగానే అవుతోంది. రూ.300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. . శనివారం, ఆదివారం, సోమవారం భక్తుల రద్దీ కనిపించింది.. మంగళవారం నుంచి పరిస్థితి మారిపోయింది.. భక్తుల రద్దీ తగ్గిపోయింది
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుండి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా ఇప్పుడు కంపార్ట్మెంట్స్ లోకి కాకుండా భక్తులను నేరుగా క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. . ఇక నిన్న స్వామివారిని 63,251మంది దర్శించుకోగా.. వారిలో 20,989మంది తలనీలాలు ఇచ్చారన్నారు. రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. . ఉత్సవాల్లోని తొలి రోజున శ్రీరాముని అవతారంలో తెప్పలపై దర్శనమిస్తారు శ్రీవారు.. రెండవ రోజున శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. ఇక చివరి మూడురోజులు మలయప్పస్వామి వివిధ ఆభరణాలతో ఉభయ నాంచారులతో తెప్పలపై నుంచే భక్తుల ధర్శనమిస్తారు. తొలి మూడు రోజులు పుష్కరిణిలో మూడు సార్లు ప్రదక్షిణలు చేసే స్వామి వారు.. నాలుగవ రోజున ఐదు ప్రదక్షిణలు, ఐదవ రోజున ఏడు ప్రదక్షణలు చేస్తారు. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేయనుంది