IPL 2024 : ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ కు హగ్ ఇచ్చిన పాండ్యా..

0
26

రోహిత్ శర్మను ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించిన నుంచి సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏకంగా రిప్ పాండ్యా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్. తన కెప్టెన్సీలో ఆడటం రోహిత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని పాండ్యా కూడా చెప్పాడు. తన కెప్టెన్సీలో ఎన్నో ఏళ్లుగా ఆడానని..ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా రోహిత్ సాయంతో జట్టును ముందుకు తీసుకెళ్తానని చెప్పాడు. అయినా రోహిత్ ఫ్యాన్స్ కు కోపం చల్లారలేదు.

అయితే లేటెస్ట్ గా నిన్న రోహిత్, పాండ్యా మైదానంలో కలుసుకున్నారు. MI కెప్టెన్సీ మార్పు అనంతరం తొలిసారి రోహిత్,పాండ్యా ఇరువురూ హగ్ చేసుకున్నారు. తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ఈ స్టార్ ప్లేయర్లు సరదాగా మాట్లాడుకోవడంతో ముంబై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బేషజాలు లేకుండా ఇద్దరూ కలిసి ఆడి ముంబైకి 6వ ట్రోఫీ అందించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్లో హార్దిక్ కెప్టెన్సీలో హిట్ మ్యాన్ తొలిసారి ఆడనున్నారు. ఐపీఎల్ 17వ సీజన్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబయి తొలి మ్యాచ్‌ ఆడనుంది.