TG Politics: కవిత త్వరగా బయటకు రావాలంటే .. ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు

0
19

కవిత అరెస్టుతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందనే ప్రచారం అబద్ధమేనని తేలిపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మొదటి నుంచి తాము ఇదే చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ తప్పించుకుని తిరగకుండా.. ఈడీ విచారణకు సహకరించాలని సూచించారు. తెలంగాణలోని 16 ఎంపీ సీట్లలోబీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోతుందని, ఒక్క మెదక్ స్థానంలోనే బీఆర్ఎస్ కు డిపాజిట్ వస్తుందని జోస్యం చెప్పారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నానని, ఆరు గ్యారంటీలు అమలు చేశాకనే రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని వీడాలని అన్నారు. నిజాం ఘగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేపించే బాధ్యత తనదని, అవసరమైతే రైతులకు పేపర్ రాసిస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నెల లోపు నిజాం ఘగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈడీ కస్టడీలో ఉన్న కవితను నాలుగో రోజు కూడా కేటీఆర్ కలిశారు. తొలి రోజు అనిల్, హరీశ్​రావుతో కలిసి వెళ్లిన కేటీఆర్.. మూడు, నాలుగు రోజుల్లో మాత్రం కేవలం అడ్వకేట్ మోహిత్ రావును వెంటబెట్టుకొని కవితను కలిశారు. ఈ సందర్భంగా.. విచారణ వివరాలను తెలుసుకుంటూ న్యాయపరంగా సహకారం అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో తీసుకుంటున్న స్టెప్స్​ను వివరిస్తూ ఆమెకు ధైర్యం చెప్తున్నారు. కాగా, కస్టడీలో ఉన్న కవితను గురువారం ఆమె తల్లి శోభ కలువనున్నట్లు తెలిసింది.