AP TTD: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

0
28

ఎగ్జామ్స్, ఎన్నికల కోడ్ వల్ల తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఎన్నికల కోడ్ కారణంగా శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ అరుదైన అవకాశాన్ని కల్పించింది. కంపార్ట్‌మెంట్లలో ఉంచకుండా నేరుగా దర్శనానికి పంపిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 69072 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 26,239 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.3.51 కోట్ల ఆదాయం లభించింది.

మరో వైపు ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌ చేశారు. క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్మహ్మోత్సవం,సహస్రదీపాలకంకరణ సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేవారు

జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.మార్చి 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కళ్యాతోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవ,సహస్రదీపాలకంకరణ సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్రస్టు దాత‌ల ద‌ర్శనం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.మార్చి 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు. మార్చి 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.