Stylish Star Allu Arjun: అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డ్..సౌత్ లో ఒకే ఒక్కడు

0
24

పుష్ప మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన పని లేదనుకుంటా..ఎందుకంటే పుష్పకు ముందు తర్వాత అన్నట్లు మారింది బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇక సోషల్ మీడియాలోనూ మనోడి ఫాలోయింగ్ మాముల్గ లేదు..ట్విట్టర్,ఇన్ స్టాగ్రమ్ లో అత్యధిక ఫాలోవర్స్ తో రికార్డులు సృష్టిస్తుండు బన్నీ.

లేటెస్ట్ గా అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేషనల్ రికార్డు సాధించారు. ఇన్ స్టాగ్రమ్ 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది సినీ నటుడిగా రికార్డులకెక్కారు. బన్నీ తర్వాత విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), రామ్ చరణ్ (20.8 M). దుల్కర్ సల్మాన్14.1 M), యశ్ (13.5 M). మహేశ్ బాబు (13.4 MM. ప్రభాస్ (11.7 MM, దళపతి విజయ్ (110.8 M) ఉన్నారు.

ప్రజెంట్ బన్నీ పుష్ప2 సీక్వెల్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత బన్నీ క్రేజ్ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి.