Revanth Reddy On Ration Cards : కొత్త రేషన్ కార్డులపై రేవంత్ గుడ్ న్యూస్

0
17

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనానికి గుడ్ న్యూస్ చెప్పారు. ఆరు గ్యారంటీలకు కీలక లింక్ గా ఉన్న రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చారు. కార్డులు లేని వారికి కొత్త కార్డులు తీసుకునే ప్రక్రియ ప్రారంభించబోతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకరానున్నారు. అలాగే మహిళలకు నెలకు రూ.2500 పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇవన్నీ సంక్షేమ పథకాలు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి.

గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో డిసెంబర్, జనవరిలో ప్రజాపాలన దరఖాస్తలు స్వీకరించారు. ప్రజాపాలనలో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. అభయహస్తం కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మీ సేవ ద్వారా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రేషన్ కార్డు ఇ కేవైసీ ప్రక్రియ కొనసాగింది. ఇ కేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29తో గడువు ముగిసింది. 80 శాతం మంది ఇకేవైసీ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో 5 ఎకరాల లోపు ఉన్నవారికి రేషన్ కార్డు ఉండేది. వైఎస్ ఈ రూల్స్ మార్చారు.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుచేయాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు. దీంతో.. మార్చి 17 లోగా మరిన్ని డెలవప్ మెంట్స్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.