IPL 2024: నేటి నుంచి ఐపీఎల్.. CSK vs RCB

0
15

నేటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ధనాధన్ ఆటతో ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించనున్నారు. రెండు నెలలకుపైగా జరగనున్న ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే-ఆర్సీబీ మధ్య జరగనుంది. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అదిరిపోనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే బాలీవుడ్ స్టార్స్, ప్రముఖ గాయకులు తమ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్‌తోపాటు సింగర్ సోనూ నిగమ్, బాలీవుడ్‌ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ పర్ఫామ్ చేయనున్నారు. అలాగే, స్వీడన్‌కు చెందిన డీజే ఆక్స్‌వెల్ తొలి ఇన్నింగ్స్ తర్వాత ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాడు.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అరగంట ముందు అంటే 7.30 గంటలకు టాస్ వేస్తారు. స్పోర్ట్స్18 హెచ్‌డీ, జియో సినిమా వెబ్‌సైట్‌, యాప్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు.

తుది జట్టు అంచనాలు

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.