మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. నిన్న కాంగ్రస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.ఒకటి రెండ్రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం పక్కా అంటూ ప్రచారం చేస్తున్నారు.
దీంతో ఆయన హస్తం గూటికి చేరడం పక్కా అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంద్రకరణ్ రెడ్డి స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇంద్రకరణ్రాకను జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అవినీతి ఆరోపణలున్న ఆయనను చేర్చుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
1980 నుండి క్రియాశీల రాజకీయాలలో ఉన్న ఇంద్రకరణ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కూడా పనిచేశారు. 1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున నిర్మల్ శాసనసభ నియోజకవర్గం సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2008లో ఉపఎన్నికల తర్వాత 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 10వ లోక్‌సభలో టీడీపీ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2018లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల 738 ఓట్ల తేడాతో ఓడిపోయారు.