తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అదే రోజు ఉదయం 11 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.
21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటా టీటీడీ విడుదల చేయనుంది.
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ విడుదల చేయనుంది.
23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు.
23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
25న ఉదయం 10గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచనుంది.
25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
కాగా.. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనార్థం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గురువారం స్వామివారిని 60,845 మంది భక్తులు దర్శించుకుని కానుకలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.