TG Politics: బీఆర్ఎస్ పార్టీకి యశోద హాస్పిటల్ రూ.94 కోట్లు విరాళం

0
31

ఎలక్టోరల్ బాండ్స్‌ డేటాలో యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీకి రూ.94 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తేలింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ముందు కూడా విరాళం ఇచ్చింది. కాగా ‘MEIL’ రూ.195 కోట్లు, చెన్నై గ్రీన్‌వుడ్స్ ప్రై. లిమిటెడ్ రూ.50 కోట్లు, డా. రెడ్డీస్ ల్యాబ్స్ రూ.32 కోట్లు, హెటిరో డ్రగ్స్ రూ.30 కోట్లు, హెటిరో ల్యాబ్స్ రూ.20 కోట్లు, DIVIS ల్యాబ్స్ రూ.20 కోట్లు బీఆర్ఎస్ కి అందించాయి.

ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్‌-4 రాజకీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ 4వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.584 కోట్లు విరాళం ఇచ్చింది. ఆ పార్టీకి అత్యధికంగా డొనేట్ చేసిన కంపెనీ ఇదేనని ఎలక్టోరల్ బాండ్ల డేటాలో వెల్లడైంది.

తన అనుబంధ కంపెనీ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ ద్వారా మరో రూ.80 కోట్లు కూడా బీజేపీకి మేఘా డొనేట్ చేసింది. మేఘా కంపెనీ మొత్తం రూ.966 కోట్ల బాండ్లను కొనుగోలు చేయగా, అందులో 60% బీజేపీకే ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి రూ.195 కోట్లు, డీఎంకేకు రూ.85 కోట్లు డొనేట్ చేసింది. దేశంలోని టాప్ 18 కంపెనీలు బీజేపీకి డొనేషన్ ఇచ్చాయి.