Southern Railways Good News : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి క్యూఆర్ కోడ్

0
12

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్ పెడుతూ క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, BHIM ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. దీంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

తొలి దశలో భాగంగా 14 ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. అందులో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , బేగంపేట, వరంగల్ , మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లు ఉన్నాయి. డిస్ ప్లే బోర్డులో బయలుదేరే స్టేషన్, చేరుకొనే స్టేషన్ , ప్రయాణపు తరగతి వివరాలు, పెద్దలు, పిల్లల సంఖ్య తెలిపే వివరాలతో పాటు చార్జీలు తెలియజేస్తారు.

రైలు వినియోగదారులందరూ సాధారణ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ అరుణ్​కుమార్​ జైన్​ కోరారు. ఈ విధానం పారదర్శకతకు, కచ్చితత్త్వానికి మైలు రాయిగా నిలుస్తోందని, నగదు చెల్లింపుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.