Pakistan PM Shehbaz Sharif : పాక్ కొత్త ప్రధానికి అరవై ఏళ్లలో ఐదు పెళ్లిళ్లు

0
26

పాక్ లో పొలిటికల్ హై డ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పదవిలో కూర్చున్న షెబాజ్ షరీఫ్.. మళ్లీ ఆ సీటు దక్కించుకున్నారు. సుధీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత పాక్ 24 వ ప్రధానిగా షెబాజాజ్ షరీప్ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సోదరుడు.

పాకిస్థాన్ లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. పాకిస్థాన్ రాజకీయ నేతల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరు షెబాజ్ షరీఫ్. తాజాగా ఆయన పెళ్లిళ్ల విషయంపై ఇప్పుడు చర్చనడుస్తుంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కు గతంలోనూ ఓసారి ఈ పదవి దక్కించుకున్న హిస్టరీ ఉంది. 60 ఏళ్ల వయసులో ఆయన ఐదో పెళ్లి చేసుకున్న మ్యాటర్ వైరల్ అవుతోంది. షెహబాజ్ వయసు 72 ఏళ్లు. ఈయన ఇప్పటి వరకు ఐదుగురిని పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు భార్యలతో ఇప్పటికే విడాకులు జరగ్గా.. మిగిలిన ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నట్లు చెబుతున్నారు.

1973లో 23 ఏళ్ల వయసులోనే ఆయన తన కుటుంబం అనుమతి లేకుండా సుస్రత్ షెహబాజ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు, ఆ తర్వాత 1993లో 43 ఏళ్ల యవసులో మోడల్ అలియా హనీనీ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో అలియా హనీ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తర్వాత నిలోఫర్ ఖోసాను పెళ్లి చేసుకున్నాడు. ఆ బంధం కూడా ఎక్కవ నిలవలేదు. కొంత కాలం తర్వాత ఒంటరిగా ఉన్న షెహబాజ్ షరీ.. 2003 లో పాకిస్థాని రచయిత్రి, నటి అయిన తెహ్మిని దురానీనీ పెళ్లి చేసుకున్నారు. ఏనిమిదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. చివరిగా 2012 లో షెహబాజ్ తన 60వ ఏట ఐదో పెళ్లి చేసుకున్నారు. కుల్సూమ్ హాయి అనే మహిళలను రహస్యంగా వివాహం చేసుకోగా.. కొన్ని రోజుల తర్వాత వారు విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

పాక్ లో పేరుమోసిన బిజినెస్ మాగ్నెట్ షెహబాజ్ షరీఫ్. లండన్ సహా.. పలు విదేశీ నగరాల్లో ఉన్న హౌజింగ్ అసెట్స్ తో కలిపి ఆయన రూ.వందల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నట్టు చెబుతున్నారు.