అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్18కి వాయిదా వేసింది. పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాల్లో తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదు.
ఇది ఈసీ రూల్స్‌కు ఇది విరుద్ధమని.. ఆయన ఎన్నిక చెల్లదని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కోర్టును ఆశ్రయించారు. ‘ఉండవల్లి మండలం పుల్లూర్ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచే స్తున్న విజయుడు రిజైన్ చేయకుండా నే నామినేషన్ దాఖలు చేశారని, ఎన్నికల నియమా వళి ప్రకారం ప్రభుత్వంలో పనిచేసిన వారు ఎవరైనా ఆ వివరాలను ఎన్నిక ల అఫిడవిట్‌లో పేర్కొనాలని, విజయుడి ఎన్ని క చెల్లదని ప్రకటించాలి’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు సైతం ప్రసన్నకుమార్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసినా, ఎన్నికల నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన విషయం విదితమే. విజయుడు బీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ పై 30 వేల573 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.