Delhi Liquor Scam: బీజేపీ ఏకైక లక్ష్యం అదే.. కేజ్రీవాల్ అరెస్ట్ పై కేటీఆర్ కామెంట్

0
18

ఢిల్లీ సీఎం అరెస్ట్ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఈడీని అడ్డంపెట్టుకుని కక్ష సాధిస్తుందని ఆరోపిస్తున్నాయి. లేటెస్ట్ గా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు. రాజకీయ ప్రతీకారంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు. ఈడీ, సీబీఐతో బీజేపీ ప్రతిపక్షాలను అణచివేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేయిస్తోంది. రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక లక్ష్యం అని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను నిన్న రాత్రి ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో కేటీఆర్ సోదరి కవితను ఈ నెల 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..

కేజ్రీవాల్ అరెస్ట్ పై ఎవరెవరు ఏమన్నారంటే..?

ఖర్గే : ప్రతిపక్షాలను BJP బలహీనపర్చాలని చూస్తోంది
సీఎం స్టాలిన్: అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోంది
కేరళ సీఎం: ఎన్నికలకు భయపడేవారే ఇలాంటి అరెస్టులకు పాల్పడతారు
శరద్ పవార్: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులు
సీతారాం ఏచూరి: మోదీ ప్రజలకు భయపడుతున్నారు