మస్క్ కు షాక్ ..ప్రపంచ కుబేరుడిగా బెజోస్

0
28

ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయారు. టెస్లా కంపెనీ షేర్ల విలువ సోమవారం ఏకంగా 7.2 శాతం క్షీణించడంతో మస్క్ సంపద విలువ 197.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. లేటెస్ట్ గా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో 200.3 బిలియన్ డాలర్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరల్డ్ నంబర్ 1 కుబేరుడిగా అవతరించారు. మూడవ స్థానంలో ఎల్వి హెచ్ఎం అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ 197. 5 బిలియన్ డాలర్లను నికర సంపదతో నిలిచారు.

ఎలాన్ మస్క్ కు, జెఫ్ బెజోస్‌ ఇద్దరి మధ్య 2021లో సంపద వ్యత్యాసం చాలా భారీగా ఉంది. అప్పుడు వీరిద్దరి మధ్య ఏకంగా 142 బిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉంది.
గత కొంతకాలంగా టెస్లా షేర్లు భారీగా పడిపోవడంతో ఎలాన్ మస్క్ సంపద కరిగిపోతుంది. 2021లో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్న టెస్లా షేర్లు, ప్రస్తుతం ఏకంగా 50 శాతం మేర పతనమైన పరిస్థితి కనిపిస్తుంది. చైనాలో ఉన్న టెస్లా కంపెనీ ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గిందన్న రిపోర్టుల నేపథ్యంలో టెస్లా షేర్లు మళ్ళీ ఇప్పుడు భారీగా క్షీణించాయి.

గతంలో 2017లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఆయన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ని అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డారు. మళ్లీ ఇంత కాలం తర్వాత ఇప్పుడు జెఫ్ బెజోస్‌ ప్రపంచ సంపన్నుడిగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.