TG Politics: సికింద్రాబాద్ కోసం కేసీఆర్ చతుర్ముఖ వ్యూహం.. ఏంటో తెలుసా..!

0
20

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి ఇంకా బీఆర్ఎస్ రెడీ కాలేదు. అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన పడుతోంది. మరోవైపు.. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు.. సికింద్రాబాద్ పరిధిలోని ఆరు సెగ్మెంట్లలో మంచి మెజారిటీ వచ్చింది. కొన్నిరోజుల వరకు తలసాని ఫ్యామిలీకే టికెట్ అని ప్రచారం చేశారు. మొదట తలసాని కుమారుడికి చాన్స్ ఇస్తారని అనుకున్నారు. తర్వాత గట్టి పోటీ ఇవ్వాలనుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవే కరెక్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా వెనుకడుగు వేశారు.

ఇప్పుడు పద్మారావు గౌడ్‌ లేదా వారి ఫ్యామిలీలో ఒకరికి టికెట్‌ ఖచ్చితమని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పద్మారావు గౌడ్‌ ఎన్నికల్లో పోటీకి సుముఖత చూపని పక్షంలో అంబర్‌పేట్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌ రెడ్డి, మాజీ హౌంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు రాంనగర్‌ మాజీ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డి పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. వీరెవరూ నిలబడలేరని పద్మారావు అయితే కాస్త పోటీ ఇస్తారని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఇంటర్నల్ సర్వేల ఆధారంగా ఓ పేరును ఇవాళో, రేపో ప్రకటించే చాన్సుంది.