AP Politics: సోమిరెడ్డికి టికెట్ రావడం సంతోషం.. వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

0
24

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 5 సార్లు ఓడినా మళ్లీ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు ఆరోసారి టికెట్ కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సర్వేపల్లి నుంచి ఆయన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2012లో కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. సోమిరెడ్డి గెలుపు రుచి చూడక రెండు దశాబ్దాలు గడిచినా ఆరోసారి టికెట్ సాధించుకున్నారు.

అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో వరుసగా ఐదవ సారి సోమిరెడ్డి ఓటమి చెందడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దండకాల కోసమే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిత్యం అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికి.. టికెట్ రావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే తాను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా అని అనుకున్నానన్నారు. కొత్తవాళ్లైతే విమర్శలు చేయడం కష్టం.. ఇక తన ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయన్నారు.