IPL 2024: ఐపీఎల్ లో ధోనీ మరో రికార్డు

0
26

చెన్నై సూపర్ కింగ్స్‌ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో రికార్డు నమోదు చేశారు. అత్యధిక రనౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనుజ్ రావత్‌ను రనౌట్ చేశారు. దీంతో ఆయన ఇప్పటివరకు 42 మందిని రనౌట్ చేశారు. దీంతో జడేజా రికార్డును బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో 249 మ్యాచ్‌లలో 23 రనౌట్‌లు చేశాడు జడేజా. ఈ జాబితాలో 23 రనౌట్లతో రవీంద్ర జడేజా టాప్ లో ఉండగా… 19 రనౌట్లతో విరాట్ కోహ్లీ, 16 రనౌట్లతో సురేష్ రైనా లిస్టులో ఉన్నారు. అలాగే 138 క్యాచ్‌లు పట్టాడు ధోనీ . ఓవరాల్‌గా 180 మందిని ఔట్ చేశారు. ధోనీ తర్వాత దినేశ్ కార్తీక్ (169), సాహా (106), రాబిన్ ఉతప్ప (90), పార్థివ్ పటేల్ (81) ఉన్నారు.

మరోవైపు ఐపీఎల్ 2024 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు నిలుస్తుందని క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. ఆ జట్టుకు 20 శాతం టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ముంబై ఇండియన్స్ (15 శాతం), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12), ఆర్సీబీ (10), కోల్‌కతా నైట్‌రైడర్స్ (8), ఢిల్లీ క్యాపిటల్స్ (8), రాజస్థాన్ రాయల్స్ (8), గుజరాత్ టైటాన్స్ (8), లక్నో సూపర్ జెయింట్స్ (6), పంజాబ్ కింగ్స్ 5 శాతం గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.