Delhi Liquor Scam: కేజీవాల్ అరెస్టుపై కేసీఆర్ ఏమన్నారంటే ?

0
31

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ స్కా్మ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అరెస్ట్ పై కేసీఆర్ స్పందించారు. కేజీవాల్ అరెస్ట్ అక్రమం, ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు.

మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రివాల్ అరెస్ట్లు ఇందుకు నిదర్శనం పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా మోడీ ప్రభుత్వం వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యా నికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఓ ప్రకటన విడుదల చేశారు.

కేజ్రివాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపి అరెస్ట్ గా పేర్కొన్నారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసు లో ఎమ్మెల్సీ కవితను వారం రోజుల కిందట అరెస్ట్ చేయగా, గురువారం ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది.