IPL 2024: బోణీ కొట్టిన చెన్నై ..ఆర్సీబీపై గ్రాండ్ విక్టరీ

0
22

ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ఉత్కంఠపోరులో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రతి ఒక్కరూ రాణించారు. ఓపెనర్ రచీన్ రవీంద్ర 37 పవర్ ప్లేలో చెలరేగితే.. మిడిల్ రహానే22, మిచెల్ 27 రాణించారు. ఆ తర్వాత జడేజా25, దూబే38 హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో చెన్నై విక్టరీ కొట్టింది. 8 బంతులుండగానే చెన్నై జట్టు తమ లక్ష్యాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ సీజన్ 2024 లో పాయింట్ల ఖాతా తెరిచిన తొలి జట్టుగా నిలిచింది. ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. యష్ దయాళ్, కరణ్ శర్మ కు చెరో వికెట్ లభించింది.

అంతకుమందు టాస్‌‌‌‌ గెలిచిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 స్కోరు చేసింది. యువ బ్యాటర్ అనుజ్ రావత్ తో పాటు సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తిక్ జట్టును ఆదుకున్నారు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. చాహర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ముస్తాఫిజుర్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇక టీ20ల్లో 12 వేల రన్స్‌‌‌‌ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‌‌‌‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌‌‌గా క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌ 14,562, షోయబ్‌‌‌‌ మాలిక్‌‌‌‌ 3,360, పొలార్డ్‌‌‌‌ 12,900, అలెక్స్‌‌‌‌ హేల్స్‌‌ 12, 319, వార్నర్‌‌‌‌ 12,065 ముందున్నారు.

ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభ మ్యాచుల్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. మొత్తం ఐదు మ్యాచుల్లో తలపడగా.. ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2021 సీజన్‌లో ముంబయిపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిగతా నాలుగింటిలోనూ పరాజయమే.