హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్‌ను వీడి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మేయర్‌తోపాటు ఆమె తండ్రి, బీఆర్ఎస్ నేత కే కేశవ రావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో చర్చలు జరిపినట్లు టాక్.
గద్వాల విజయలక్ష్మి2016లో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు 2021లో రెండవసారి గెలిచి, మేయర్‌గా ఎన్నికయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు, మాజీ మేయర్ బొంతు దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మల్కాజ్ గిరి, సికింద్రాబాద్,చెవెళ్ల పార్లమెంట్ స్థానాలలో గెలుపు టార్గెట్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక .. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రానందున.. ఈసారి ఎంపీ ఎన్నికలలో భారీ ఎత్తున చేరికలతో ఆయా స్థానాలను స్వీప్ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.