Good News: గుడ్ న్యూస్ .. మే13న వేతనంతో కూడిన సెలవు

0
16

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్(మే 13) రోజు వేతనంతో కూడిన సెలవును ఇస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు మంజూరు చేసినట్లు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే.. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 25వ తేదీ వరకు అవకాశం కల్పించగా… ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. ఇక.. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు.. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి.