TG Politics: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ప్రస్థానం ఇదే..

0
16

బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తున్న మెదక్ ఎంపీ సీటుకు ఎమ్మె్ల్సీ వెంకట్రామిరెడ్డి పేరును ప్రకటించింది. ఇక్కడ బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. నీలం మధు పేరు వినిపిస్తోంది. ఇక్కడ మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది.ఒక్క మెదక్ లో కాంగ్రెస్ గెలిచింది. ఇక మోడీ హవాతో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెదక్ లో ఎవరు గెలుస్తారా అనే చర్చలు మొదలయ్యాయి.

వెంకట్రాం రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా అధికారిగా పలు హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. డ్వామా పీడీ మొదలుకుని అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా, 2014 నుంచి 2017 వరకు ఉమ్మడి జిల్లా జేసీగా పనిచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఐదేండ్లు పనిచేశారు. ఆ తరువాత మెదక్ జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా కూడా ఇక సంవత్సరం పాటు విధులు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు . సర్వీసు ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసీఆర్. ఇప్పడు మెదక్ ఎంపి టికెట్ కూడా వెంకట్రామిరెడ్డికే కేటాయించిన కేసిఆర్.

మరో వైపు మెదక్ ఎంపీ స్థానానికి తనను అభ్యర్థిగా ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను ప్రభుత్వ అధికారిగా పని చేశాను కాబట్టి ఎమ్మేల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావ్, కేసీఆర్ లు నన్ను ఎంపిక చేశారు. ప్రజలతో మమేకమై ఉన్నందునే నాకు ఈ అవకాశం దక్కింది. పదిన్నర సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారిగా ప్రజా జీవనం లో ఉన్నాను.