Tamilnadu Politics: లోక్ సభ బరిలో సినీ నటి రాధిక..ఎక్కడి నుంచి అంటే.?

0
22

తెలుగు వాళ్లకు సుపరిచితమైన సినీ నటి రాధిక బీజేపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతుంది. తమిళనాడులోని విరూధ్ నగర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. నిన్న బీజేపీ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. అయితే దీని కోసం ఆమె ఏకంగా తన పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీకి మద్దతిచ్చిన రాధిక లోక్ సభ ఎన్నికల వేళ తన పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేశారు. అనుకున్నట్టుగానే ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు.

2006 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు.18 అక్టోబరు 2006న, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆమె ఏఐఏడీఎంకే నుండి తొలగించబడ్డారు. ఆమె 2007 నుండి అఖిల భారత సమతువ మక్కల్ కట్చి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల బీజేపీలో విలీనం చేశారు.

61 ఏళ్ల రాధిక వినోద రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, భాషల్లో సినిమాలు చేశారు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. కాలంతో పాటు మారుతూ ఓటీటీలో కూడా తన ప్రతిభను చాటుతున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు.