TG Politics: గవర్నర్ హోదాలో తొలిసారి ఢిల్లీకి రాధాకృష్ణన్

0
20

ఇటీవల తెలంగాణ గవర్నర్‌‌‌‌‌‌‌‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్ తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు. నిన్న పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్లిన గవర్నర్ సాయంత్రం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ హోదాలో తొలిసారిగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన బస చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఇతరులను మర్యాద పూర్వకంగా కలవనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే..

తమిళిసై రాజీనామాతో ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ను తెలంగాణ ఇన్ ఛార్జ్ గవర్నర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం అయ్యే వరకు సీపీ రాధాకృష్ణన్‌ తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌లుగా కొనసాగనున్నారు. సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర బీజేపీ చీఫ్‌గానూ పనిచేశారు. ఆల్ ఇండియా కాయర్ బోర్డు ఛైర్మన్‌గా(2016-2019) సేవలందించారు. గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు.