గుజరాత్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై అదరగొట్టింది.63 రన్స్ తో గ్రాండ్ విక్టరీ సాధించింది. బెంగళూరుపై తొలి గెలుపు నమోదు చేసుకున్న చెన్నై రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబె 51, రుతురాజ్ 46, రచిన్ రవీంద్ర 46 చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది చెన్నై. శివమ్ దూబెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా.. సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
207 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్‌ను సీఎస్కే పేసర్లు అడ్డుకున్నారు. థర్డ్ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ 8 ఔట్‌కాగా.. సాహా, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ ఐదో ఓవర్‌లో దీపక్ చహర్ (2/28) దెబ్బకు సాహా వెనుదిరగడంతో గుజరాత్ వికెట్ల పతనం మొదలైంది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది.చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే, ముస్తఫిజుర్ రెహమాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.