Temperature: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు..10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

0
20

తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఆరు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య నమోదవ్వగా. . 14 జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. మిగతా 11 జిల్లాల్లో 40లోపు నమోదయ్యాయి. మరోవైపు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ నెల 30, 31, ఏప్రిల్ 1 న రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

ఆదిలాబాద్
కుమ్రంభీం ఆసిఫాబాద్
మంచిర్యాల
నిర్మల్
నిజామాబాద్
జగిత్యాల
రాజన్న సిరిసిల్ల
నల్గొండ
సూర్యాపేట
మహబూబాబాద్

అత్యధికంగా నిన్న 42 డిగ్రీలు

ఆదిలాబాద్ జిల్లా సాత్నాల- 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత
కుమ్రం భీం​ ఆసిఫాబాద్- 42
మంచిర్యాల జిల్లాలో- 41.8,
సూర్యాపేట- 41
నల్గొండల్లో- 41.7
నిజామాబాద్ -41.5
నిర్మల్-​ 41.4
ములుగు- 41.1
సిద్దిపేటల్లో- 40.9
కామారెడ్డి- 40.8
యాదాద్రి భువనగిరి- 40.6
రంగారెడ్డి జిల్లాల్లో -40.5
నాగర్​కర్నూల్ -40
మహబూబ్​నగర్ జిల్లా- 40.3