Delhi Liquor Scam: లిక్కర్ కేసు.. తిహార్ జైల్లో ఉన్నది వీళ్లే..

0
21

దేశ వ్యాప్తంగా లిక్కర్ స్కాం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించారంటూ ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీసీఎం అరవింత్ కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే..అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులందరూ తీహార్ జైల్ లోనే ఉన్నారు. నిన్న ఇదే జైలుకు కవితను కూడా తరలించారు.

లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నది వీళ్లే

ఈ స్కామ్ లో అరెస్ట్ అయిన వారిలో ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, బినోయ్ బాబు, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా, అమన్ దీప్ పాల్ లు ఉన్నారు. అలాగే సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, మాగుంట రాఘవ రెడ్డి లను తీహార్ జైల్ కే పంపించారు.

అలాగే అప్రూవర్లుగా మారడం, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఈ కేసులో పలువురికి బెయిల్ లభించింది. ఈ నెల 20 వ తేదీన కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తోన్న అభిషేక్ బోయినపల్లికి భార్య అనారోగ్యం దృష్ట్యా సుప్రీంకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 19 నెలల తర్వాత అభిషేక్ కు ఈ తాత్కాలిక ఉపశమనం దక్కింది.