TG Politics: నా ఫోన్‌నూ ట్యాప్ చేశారు.. బండి సంజయ్ ఆరోపణలు

0
21

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో తనపై నిఘా పెట్టిందన్నారు. తన ఫోన్‌నూ ట్యాప్ చేయించిందని ఆరోపించారు. కరీంనగర్‌లో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ మండలాల ఇన్‌ఛార్జులతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ సంజయ్‌ ఈ కామెంట్స్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలిసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ సర్కారు విచారణ పేరుతో సాగదీస్తుండగా, ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయడం లేదన్నారు.

మరోవైపు ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌‌‌‌‌‌‌‌ తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు, బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ బాధితులు ఉన్నారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం డీజీపీ రవిగుప్తాకు ఆయన ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఆధారాలను డీజీపీకి ఎమ్మెల్యే అందించారు.