AP Politics :ఇవాళ్టి నుంచి జగన్ బస్సు యాత్ర.. తొలిరోజు షెడ్యూల్ ఇదే

0
26

వైసీపీ అధినేత జగన్ నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్నారు. మ.ఒంటిగంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మ.1.30 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, వేంపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సా.4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోకజవర్గాలు మినిహా మిగిలిన 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది. ఈ యాత్ర 21 రోజులపాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

బస్సుయాత్ర తొలిరోజు షెడ్యూల్ ఇలా .
.
బుధవారం ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయలుదేరుతారు.
మధ్యాహ్నం 1గంటకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని అక్కడ నివాళులర్పిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు.
మొదటి రోజు (బుధవారం) ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు.
ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగిస్తారు.
బహిరంగ సభ అనంతరం సున్నంపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డుకు చేరుకుంటారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరానికి జగన్ చేరుకొని అక్కడే బస చేస్తారు.