TG Politics: రేపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

0
26

రేపు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్‌ నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. వీరిలో 644 మంది పురుషులు, 795 మంది మహిళలున్నారు.

కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. కాగా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశం ఉత్కంఠను రేపుతోంది. బీఆర్ఎస్ కు క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఓటర్ల బలం ఉంటే కాంగ్రెస్‎కు రాష్ట్రంలో అధికార బలం ఉంది.

మహబూబ్‌నగర్‌ శాసనమండలి ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ వేసింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు భారీ స్కెచ్‌ వేశారు. కాంగ్రెస్‌ నేతల ప్రలోభాలకు గురికాకుం డా తమ ప్రజాప్రతినిధులందరినీ బీఆర్‌ఎస్‌ నేతలు శిబిరాలకు తరలించారు. ఎమ్మెల్సీని గెలిపించి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బహుమతిగా అందించాలని, ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే లు, అభ్యర్థికి మధ్య ఉన్న విభేదాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు.