TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం5 గంటల వరకే టైమ్

0
16

గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ టీఎస్పీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన అయ్యి తమ అప్లికేషన్ ను ఎడిట్ చేసుకోవచ్చు.

తద్వారా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఫొటో, సంతకం తదితర వివరాల్లో తప్పులను సరి చేసుకోవచ్చు. అయితే.. ఇందుకు సంబంధించి ధ్రువపత్రాలను అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 563 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుంది.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఎడిట్ ఇలా..

Step 1: అభ్యర్థులు మొదటగా టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో Group 1 Services Online Edit Application ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత లాగిన్ పేజీ లో టీఎస్పీఎస్సీ ఐడీ, డేటా ఆఫ్‌ బర్త్, వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి GET OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Step 5: అక్కడ మీ వివరాలను సరి చూసుకుని.. ఏమైనా తప్పులు ఉంటు మార్చుకోవాలి.
Step 6: ఎడిట్ చేసిన వివరాలకు సంబంధించిన ధృవపత్రాలను సబ్మిట్ చేయాలి.