TG Politics: ప్రారంభమైన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

0
22

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2న ఓట్లు లెక్కిస్తారు.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్యేలు14, ఎంపీలు 02, ఎమ్మెల్సీలు 03 మొత్తం 19 మంది.. ఇక ఎంపీటీసీ సభ్యులు 888, జడ్పీటీసీ 83, మున్సిపల్ కౌన్సిలర్లు 449.. మొత్తం 1439 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కాగా,, మహబూబ్‌నగర్ ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ ఓవర్ యాక్షన్‌తో మీడియా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పాసులు ఉన్నా మీడియాను పోలింగ్ స్టేషన్ ముందు వరకు కూడా అనుమతించడం లేదు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఎన్‌హెచ్167 పైనే నిలబడిపోయారు.