AP Politics: ఎన్డీఏ కూటమి పెండింగ్ స్థానాలు ఇవే

0
24

ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మరో 8అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో టీడీపీ పోటీ చేసే ఆరు నియోజకవర్గాలు చీపురుప‌ల్లి, భీమిలి, దర్శి, అనంతపురం అర్బన్‌, గుంతకల్లు, ఆలూరు ఉన్నాయి. ఇక జనసేన పాలకొండ, విశాఖ సౌత్‌, అవనిగడ్డ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది.

పొత్తులో భాగంగా పది అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..
1)ఎచ్చెర్ల – ఎన్ ఈశ్వర రావు(కమ్మ )
2)విశాఖపట్నం నార్త్ – విష్ణు కుమార్ రాజు
3)అరకు లోయ – పంగి రాజారావు
4)అనపర్తి – ఎం.శివ కృష్ణం రాజు
5)కైకలూరు – కామినేని శ్రీనివాసరావు(కమ్మ )
6)విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి (కమ్మ )
7)బద్వేల్ – బొజ్జా రోశన్న
8)జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
9)ఆదోని – పార్థసారథి
10)ధర్మవరం – వై.సత్యకుమార్